Latex pillows and beds మెత్తగా ఉండాలా? గట్టిగా ఉండాలా? Health కి ఏది మంచిది?

Latex pillows and beds మెత్తగా ఉండాలా? గట్టిగా ఉండాలా ? అసలు Health కి ఏది మంచిది?
పరుపు ఎప్పుడూ గట్టిగానే ఉండాలి, పిల్లోస్ ఎప్పుడు మెత్తగానే ఉండాలి. అవి లాటెక్స్ అయినా సరే. ఇలా మెత్తగా ఉంటే ముఖ ఆకారాన్ని బట్టీ పిల్లో ఎంతవరకు అవసరమో అంతవరకే కిందికి దిగుతుంది. అప్పుడు హాయిగా నిద్ర పడుతుంది. పరుపు మెత్తగా ఉంటే పడుకున్న చోట మెత్తగా ఉన్నప్పుడు మన బరువు మొత్తం వెన్నుపూస మీద పడి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి (మెడ నొప్పి, నడుము నొప్పి). అందువల్ల పిల్లో మెత్తగా ఉండి పరుపు గట్టిగా ఉండాలి.

మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే: పిల్లో అయినా పరుపుపైన బరువుగా ఉండాలి. లైట్ వెయిట్ పిల్లో ఫైబర్ పిల్లోస్ ప్రస్తుతం 2000 రూపాయల ధర పలుకుతున్నా, 300 గ్రాములు, 200 గ్రాములు, ఇంకా అరకేజీ లోపుగా మాత్రమే బరువును కలిగి ఉంటున్నాయి. కేజీ, రెండు కేజీల బరువు ఉండి, మెత్తగా ఉండే పిల్లోలు మంచివి. లోపల క్లాత్ పెట్టి కుట్టినవే అయినా లాటెక్స్ అయినా మంచి మెటీరియల్ తో నింపబడి బరువుగా ఉండాలి. ఫైబర్ పిల్లో అయినా కనీసం అరకేజీ బరువు ఉండేలా చూసుకోవాలి.

లైట్ వెయిట్ పిల్లో అయితే పడుకున్నప్పుడు జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు నిద్ర సౌకర్యవంతంగా పట్టదు. పరుపు కూడా అంతే. పడుకున్నప్పుడు కదిలిపోకూడదు, బరువు ఉంటేనే కదలకుండా ఉంటుంది. లైట్ వెయిట్ పరుపు అయితే మనం కదిలినప్పుడల్లా పరుపు కూడా కదిలిపోతూ ఉంటుంది.

online పరుపులన్నీ 10 కేజీల బరువు మాత్రమే ఉంటున్నాయి, 6×6 పరుపులు గుండ్రంగా చుట్టేసి వస్తాయి. అవన్నీ లైట్ వెయిట్ ఉండడం వల్ల నిద్రలేమి, ఇంకా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.పరుపు ఏదైనా బరువుగా ఉండాలి. రీబాండెడ్ పరుపు తీసుకున్నట్లయితే: అడుగుకి 6 కేజీలు ఉండాలి. అంటే ఆరు అడుగుల పరుపు 36 కిలోలు ఉండాలి. అలానే లాటెక్స్ కూడా. నాలుగు అంగుళాలు లాటెక్స్ 36 కేజీలు ఉండాలి. ఎనిమిది అంగుళాల పరుపు 70 కేజీలు ఉంటే కదలకుండా ఉంటుంది. పరుపు సైజును బట్టీ బరువు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉండాల్సిన బరువు కన్నా పరుపు తక్కువ బరువుగా ఉంటే సరిగా నిద్ర పట్టదు.

హెచ్ఆర్, సూపర్ సాఫ్టు, pu ఫోమ్ ఆరు అడుగులు పరుపులు 10 కిలోలు మాత్రమే ఉంటాయి. మెమొరీ ఫోమ్ అయితే మరి కొంచెం ఎక్కువ బరువు ఉంటుంది. కానీ రీబాండెడ్ లాటెక్స్ లా అంత బరువు ఉండవు. పరుపులు ఖచ్చితంగా బరువు ఉండాలి. అయితే పిల్లోస్ ఎప్పుడు మెత్తగా ఉండాలి, పరుపు ఎప్పుడూ గట్టిగా ఉండాలి. మెడ నొప్పి ఉన్నవారు పిల్లోస్ పల్చటివి వాడుకోవాలి. పక్కకు తిరిగి పడుకుంటే ఆ ఖాళీ ఎంత ఉందో అంత వాడుకోవాలి.అయితే ఈ పిల్లోస్ పరుపులు మెడ నొప్పిని నడుము నొప్పిని తగ్గించవు. అవి రాకుండా మాత్రమే చేస్తాయి.

ఇంకా పరుపు ల విషయములో ఎటువంటి సందేహాలున్నా ప్రతి ఆదివారం సాయంత్రం 5గంటల నుండి 6గంటల వరకూ ప్రత్యక్షంగా నిర్వహించే కార్యక్రమాల లో పాల్గొనవచ్చు. ఇంకా మరింత సమాచారం కొరకు మా vfurnituremall app ను తప్పనిసరి గా download చేసుకోగలరు. www.furnituremall.com website ను సందర్శింవచ్చు.

watch full video

Select an available coupon below