ఏ పరుపు అయినా సరే బరువు, సాంద్రత, నాణ్యత ఈ మూడు బాగుంటేనే కొనుగోలు చేసుకోవాలి. థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా, ఇండియా, కేరళ, యూపీ ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్నా, వాటిల్లో నాలుగు నాణ్యతలతో తయారుచేయబడి వస్తాయి. స్వచ్ఛమైన లాటెక్స్ తో, లాటెక్స్ లో పిల్లర్ అంటే పౌడర్ పోసి తయారుచేస్తారు. అచ్చంగా లాటెక్స్ లానే ఉంటుంది కానీ, దాని ధర తగ్గిపోతుంది లాటెక్స్ లో సింథటిక్ కలుపుతారు.ఫోమ్ నే లాటెక్స్ లా తయారు చేసే టెక్నాలజీ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది.
ఈ నాలుగు రకాలు అన్ని దేశాలూ తయారు చేస్తాయి. ఇండియాలో కన్నా, థాయిలాండ్ పరుపుల్లో ఎక్కువగా మోసాలు జరుగుతూ ఉంటాయి. స్థానికంగా తయారైన వస్తువుకి,వేరే దేశంలో తయారైన వస్తువుకి రవాణాలో తేడా ఉంటుంది. ఇండియా నుండి అమెరికాకి, యూరప్ లకే కాదు అన్ని దేశాలకి ప్రతిరోజు రెండు కంటెయనర్ లాటెక్స్ ఎగుమతి చేయబడుతూ ఉంటుంది.
థాయిలాండ్, శ్రీలంక లాటెక్స్ మనకి దిగుబడి చేయబడి, ధర తక్కువగా నిర్ణయించబడి ఉంటుంది. రసాయనాలు ఎక్కువగా కలిపి ధర తక్కువగా వెచ్చించి, ఒరిజినల్ లాటెక్స్ లా తయారుచేసి దిగుమతి చేస్తారు. కాబట్టి ఇక్కడ లాటెక్స్ కన్నా తక్కువ ధర కైనా, సమాన ధర కైనా అమ్మకాలు చేస్తారు. లాటెక్స్ లో పెట్టే పెద్ద చిల్లులు, చిన్న చిల్లులు వల్ల లాటెక్స్ బరువులో తేడా వస్తుంది. 7 జోన్ టెక్నాలజీ లాటెక్స్ లో పెద్ద చిల్లులతో తయారుచేస్తారు.
కాబట్టి బరువు తక్కువగా ఉంటుంది. ఎక్కువ రేటుకి అమ్మకాలు చేస్తున్నారు. 7 జోన్ టెక్నాలజీ మంచిదే కానీ, ఆ బరువుకి తగినట్లు ధర వెచ్చించగలిగితేనే మంచిది. లాటిక్స్ షీట్ 10 కేజీలు బరువు ఉంటే, 7 జోన్ లాటెక్స్ షీట్ బరువు తొమ్మిది కేజీలే ఉంటుంది. ఎందుకంటే పెద్ద చిల్లులతో తయారీ వల్ల దానికి ఉపయోగపడే పిండిలో ఆదా అవుతుంది. సెవెన్ జోన్ అని చెప్పి ధర ఎక్కువగా చెప్పే వారిని అస్సలు నమ్మకూడదు.
సెవెన్ జోన్ కన్నా మోనోజోన్ పరుపులకే ఎక్కువ లాటెక్స్ పడుతుంది. లాటెక్స్ ఏ దేశానికి చెందినా సరే ఒరిజినల్ లాటెక్స్ ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. సెవెన్ జోన్ లాటిక్స్ కచ్చితంగా 90 డెన్సిటీని కలిగి ఉండాలి. ఒకవేళ సెవెన్ జోన్ లాటెక్స్ ధర తక్కువకి వచ్చినప్పుడు కూడా కొనుక్కోవచ్చు. ఇండియా లాటెక్స్ కన్నా ధర తక్కువగా ఉండాలి.
ఫోమ్ ధర 10 వేలుగా ఉంటే, లాటెక్స్ ధర 20వేలుగా ఉంటుంది. కంపెనీలు ఫోమ్ నే లాటెక్స్ గా తయారుచేసి 20,000 కమ్ముతున్నాయి. ఇలా మోసాలు జరుగుతున్నాయి. ఒరిజినల్ లాటెక్స్ కొనలేని వారు ఆర్టిఫిషియల్ లాటెక్స్ ను కొనుక్కోవచ్చు. కానీ ఆర్టిఫిషియల్ లాటెక్స్ కి, ఒరిజినల్ లాటెక్స్ ధర చెల్లించకూడదు. అప్పుడు నష్టం కలుగుతుంది. ఫోమ్ కి వెచ్చించే మొత్తం తోనే ఆర్టిఫిషియల్ లాటెక్స్ కొనుక్కుంటే మాత్రమే ఉపయోగకరం.
ప్రస్తుతం ఏ దేశమైనా ఆర్టిఫిషియల్ లాటెక్స్ ని ఎక్కువ ధరలకే అమ్ముతున్నారు. తేడాలను జాగ్రత్తగా గమనించుకొని ఒరిజినల్ లాటెక్స్ ని మాత్రమే ఎంచుకోవడం మంచిది. ఇంకా వినియోగదారులకు కలిగే సందేహాల కోసం ప్రత్యక్ష ప్రసారంలో నివృత్తి చేసుకోవచ్చు.
ప్రతి ఆదివారం v furniture mall యాజమాన్యం వారు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు జరిగే ప్రత్యక్ష ప్రసారంలో కలుసుకోవచ్చు. మరింత సమాచారం కొరకు మా https://develop.varamlatex.in websites ను చూడవచ్చు. V Furniture mall app ను download చేసుకోవచ్చు.