Tips for people using mattress on floor-పరుపు నేలమీద వేసుకొని వాడుకునేవారు ఈ చిన్నTips పాటించాలి 

మేకింగ్ బెడ్ అంటే తయారు చేసుకున్న పరుపును కూడా నేల మీద వేసుకొని పడుకోవచ్చు. అయితే రోజూ ఇల్లు తుడిచే సమయంలో ఎంతో కొంత నీటి చెమ్మని పరుపు పీల్చుకుని పరుపు పాడయ్యే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల తిన్న ఆహారం నేల మీద పడినట్లయితే దానికోసం వచ్చే చీమలు క్రిమి కీటకాదులు పరుపు మీదకు ఎక్కే అవకాశం ఉంటుంది.

ఎత్తు తక్కువలో పరుపు ఉంటే అటు ఇటు నడవడం పరుపును తొక్కే అవకాశం ఉంటుంది. ఈ కారణాలవల్ల పరుపు పాడైపోవడమే కాకుండా, అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. పైన ఉదాహరించిన కారణాలకు పరుపు గురి అవ్వదు, జాగ్రత్తగా పరుపును నిర్వహించుకోగలమనే నమ్మకం ఉన్నవారు నేల మీద పరుపు వేసుకొని నిద్రించొచ్చు. అయితే పరుపులు నేల మీద వేసుకున్నా, మంచం మీద వేసుకున్నా ఒక్కటే అనుభూతి కలుగుతుంది. నేల మీదనే పరుపు వేసుకోవడానికి ఆసక్తి చూపేవారు ప్లైవుడ్ షీట్ కానీ, wpvc షీట్ కానీ నేల మీద వేసుకొని దానిమీద పరుపును వేసుకున్నట్లయితే, పరుపుని అవి కాపాడుతూ ఉంటాయి. నీటిని పరుపు దరికి చేరనివ్వవు. ఇంకా చీమలు, క్రిమి కీటకాదుల నుండి ఆ చెక్క కాపాడుతూ ఉంటుంది.

18 mm, 12mm ప్లే వుడ్ షీట్లను వేసుకోవడం వల్ల పరుపు కూడా కొంచెం ఎత్తు ఎక్కువగా అనిపిస్తుంది. దానికోసం అయ్యే వ్యయం కూడా ఎక్కువగా ఉండదు. నేల మీద పరుపు వేసుకున్నట్లయితే, కనీసం పరుపు నాలుగు అంగుళాలు అయినా, 6అంగుళాలు అయినా, ఎనిమిది అంగుళాలైనా నేల మీద నుండి ఎంత ఎక్కువ ఎత్తు గా ఉంటే అంత మంచి అనుభూతిని ఇస్తుంది.

ఈ నాలుగు అంగుళాలు, 6 అంగుళాలు 8 అంగుళాలు పరుపు మొత్తం లాటెక్స్ పరుపే కానక్కర్లేదు, రీబాండెడ్ పరుపును నేల మీద వేసుకొని దానిమీద సూపర్ సాఫ్ట్ ను కానీ, ఆర్థిక స్థోమతను అనుసరించి భరించగలిగే వారికి లాటెక్స్ కానీ చాలా మంచిది. ఫోమ్ ను కానీ వేసుకోవచ్చు. దాని కింద రీబాండెడ్ పరుపు నాలుగు అంగుళాల్లో వేసుకున్నట్లయితే తక్కువ ఖర్చులో పరుపు ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. పరుపు గట్టిగా ఉంటుంది, మంచి ప్రామాణికతలతో చక్కటి అనుభూతిని పరుపు వల్ల సొంతం చేసుకోవచ్చు.

550 రకాల పరుపుల్ని మంచి ఎత్తులో చక్కటి అనుభూతి కలిగించేలా తయారుచేసి v furniture mall యాప్ లో భద్రపరచడమైంది. app ను డౌన్లోడ్ చేసుకొని ఇన్ని రకాల పరుపుల్ని సందర్శించి ఆసక్తి గలవారు యాప్ లోనే కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకా ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 6గంటల వరకూ v furniture mall యాజమాన్యం వారు ప్రత్యక్షంగా నిర్వహించే కార్యక్రమాల లో పాల్గొని వినియోగదారులు తమ సందేహాలు ను నివృత్తి చేసుకోవచ్చు. మరింత సమాచారం కొరకు మా https://develop.varamlatex.in/ website లను చూడవచ్చు.

watch full video

Select an available coupon below