ఒరిజినల్ లాటెక్స్ కి, ఆర్టిఫిషియల్ లాటెక్స్ కి మనం సరిగా గమనించినట్లయితే, మూడు రకాల తేడాలని గుర్తించవచ్చు. ఆర్టిఫిషియల్ లాటెక్స్ ను రసాయనాలతో చేస్తారు. పిల్లో చూడడానికి నున్నగా చిల్లులతోనే తయారు చేస్తారు. ఇక సహజమైన లాటెక్స్ పిల్లో రబ్బరు వాసనను కలిగి ఉంటుంది. పైన నున్నగానే ఉన్నా, లోపలవైపు చిల్లుల వద్ద పలుకులు పలుకులుగా ఉంటుంది. ఎలా అంటే స్వచ్ఛమైన నెయ్యి కరగపెట్టినప్పుడు లభించే పలుకులు నేయిలా. కృత్రిమ లాటెక్స్ రసాయనాల వాసనను కలిగి ఉంటుంది. […]