కంపెనీలు పరుపుల్ని online లో ఒకరకంగా, షోరూంలో ఒకరకంగా, వాళ్ళ కంపెనీ స్టోర్లు పెట్టిన చోట ఒకరకంగా, డీలర్లకి ఒకరకంగా రకరకాల బ్రాండ్లు వేసి అమ్ముతున్నారు. Online ఫోమ్ మెమరీ బెడ్ అమ్మేటప్పుడు ఒక బ్రాండ్ తో 100 రోజులు ట్రైల్ అమ్మకానికి ₹10,000 కు ధరను నిర్ణయిస్తారు. అదే కంపెనీ అయినా డీలర్ల దగ్గర 15000₹ కి, అదే కంపెనీ అయినా వాళ్ల షోరూమ్ లో 30000₹ కి, అదే కంపెనీ వారు షాపులకి ఇచ్చేటప్పుడు 40 వేల రూపాయలకు అమ్ముతారు.
షాపుల వారు డీలర్ షిప్ తీసుకుని అమ్మేటప్పుడు మూడు చేతులు మారి వస్తాయి. ఒక్కోచోట 10% చొప్పున డిస్కౌంట్ రూపంలో తేడా వస్తుంది. కంపెనీలు షోరూమ్ పెట్టినప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఒక పరుపు తెస్తే అది ఎప్పుడు అమ్మకం జరుగుతుందో తెలియని పరిస్థితులు. ఇంకా పరుపుల్లో 10 రకాల సైజుల్లో 10 రకాల వెరైటీలు 10 రకాల అంగుళాల కొలతలు ఉంటాయి.
30 రకాల పరుపులు ఉన్నా కానీ, రకానికి ఒక పరుపు పెట్టినా కానీ షాపులో రెండు పరుపులు ఇవ్వడానికి వీలులేనంత పరిస్థితి. దానివలన పెట్టుబడి పెరిగిపోతుంది. షాపు అద్దెలు, ఖర్చులు పెరిగిపోయి షోరూంలో పరుపు నాణ్యత బాగున్నప్పటికీ ధర బాగా ఎక్కువగా వెచ్చించాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద బ్రాండ్ ల పరుపుల నాణ్యత బాగుంటుంది.
షాపు సిబ్బందికి అయ్యే ఖర్చు, వినియోగదారులకు అందించే డిస్కౌంట్ ల వల్ల 10 వేల రూపాయల విలువ చేసే పరుపు 40 వేల రూపాయలు అవుతుంది. తర్వాత చిన్న చిన్న షాపులు ఇదే కంపెనీ వారు కేవలం మూడు నాలుగు రకాల పరుపుల్ని తయారు చేసి మామూలు క్లాత్లు వేసి తక్కువ డిస్కౌంట్లతో 40 వేలు విలువ చేసే పరుపుల్ని 30 వేల కి షాపులకి ఇచ్చేసి అమ్ముతారు.
ఇంకో రకం ఏంటంటే కంపెనీలే షోరూంలో తయారుచేసి ప్రముఖ నటీ నటుల తో ప్రచారం చేయించి 40,000₹ పరుపుని లక్ష రూపాయలకి కూడా అమ్ముతున్నారు. మరి online లో ఇదే కంపెనీ 10,000 రూపాయలకే అమ్మడానికి కారణం ఏంటంటే online లో పరుపులన్నీ రోల్ చేసి రావాలి. ఇలా రోల్ చేయడానికి తక్కువ డెన్సిటీ ఫోమ్ మాత్రమే అనువుగా ఉంటుంది.
రీబాండెడ్లు, బరువైన పరుపుల్ని రోల్ చేయడానికి కుదరదు. అందుకే online లో కేవలం తక్కువ డెన్సిటీ కలిగిన తక్కువ నాణ్యత కలిగిన ఫోమ్ లను రోల్ చేయడానికి అనువుగా ఉండడం ఒక కారణం. వీటికోసం అధికమైన ఖర్చులు ఉండవు. వంద రోజుల ట్రైల్ అని చెప్తారు కానీ, వినియోగదారులని ఖచ్చితంగా ఇబ్బందులకు గురిచేస్తారు.
మెమరీ ఫోమ్ అని చెప్పి అమ్మే వాటి కొలతలు సరిగ్గా ఉండవు. V furnituremall లో అయితే 65% డెన్సిటీలో అందుబాటులో ఉంటుంది. ఇలా అమ్మే కంపెనీలలో గరిష్టంగా 35 40 డెన్సిటీ ఉండడం కూడా అరుదే. V furnituremall లో అయితే రెండు అంగుళాలు కచ్చితంగా ఉంటాయి. కంపెనీలలో అయితే అర అంగుళం పాతిక అంగుళాలు కూడా కష్టమే. V furnituremall లో hr ఫోమ్ 2 అంగుళాల మెమరీ ఫోమ్ అని స్పష్టంగా చెప్తారు.
ఇతర కంపెనీల్లో ఇలా విడివిడిగా కొలతలు చెప్పకుండా మొత్తంగా 6అంగుళాలు మెమరీ ఫోమ్ అని చెప్పి అమ్మకాలు చేస్తారు. కానీ అందులో hr ఫోమ్ మెమరీ ఫోమ్ తో పాటు రకరకాల ఫోమ్ లు కలిపి తయారుచేస్తారు. రవాణా ఖర్చులు ఇతర ఖర్చులు ఏమి ఉండవు మొత్తం ప్యాకింగ్ చేసి, సీల్ వేసి, గుండ్రంగా చుట్టేసి పంపించేస్తారు. రెండు మూడు సంవత్సరాలు గడిచాక ఆ కంపెనీ వేరే వారికి అమ్మకం జరిగిపోతుంది.
వారు మళ్లీ కొత్త బ్రాండ్ వేసి వాటిల్ని అమ్మకాలు జరుపుతాయి. ఆ పరుపుకి వచ్చే సమస్యలకు ఎవ్వరూ స్పందించరు. ఆ కంపెనీ కూడా ఉండదు. గత మూడు సంవత్సరాల్లో ప్రతి 30 కంపెనీలకి ఐదు కంపెనీలు మాత్రమే మనుగడలో ఉంటున్నాయి. ఈ ఐదారు కంపెనీలు వస్తువు విలువ పెంచుకోవడం కోసం అమ్మేస్తూ ఉంటారు. రకరకాల పద్ధతులను వాడి అమ్మకాలు చేసేస్తూ ఉంటారు. షో రూముల్లో అయినా, షాప్స్ లో అయినా నాణ్యత కనిపిస్తుందేమో కానీ online లో అమ్మే వాటిలో నాణ్యత కొంచెం కూడా ఉండదు.
వాటి వాడకం వల్ల అనేక అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఎన్ని మార్పులు చేసినా 100% సౌకర్యంగా తీసుకురాలేరు. V furnituremall లో పరుపుకి గ్యారెంటీ ఇవ్వకపోయినా పరుపు నాణ్యతగా ఉంటుంది. ఇక్కడ గ్యారెంటీ సరుకుని ఇచ్చి సరుకుకు గ్యారెంటీ ఇవ్వరు. మిగతా అన్ని కంపెనీలు గ్యారెంటీ లేని సరుకు ఇచ్చి, గ్యారెంటీ ఇస్తారు. యాజమాన్యం వారు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. వినియోగదారుల సందేహాలను ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉంటారు.
V furnituremall లో కేవలం పరుపు అమ్మకాలే కాదు, దాని జీవితకాలం మొత్తం అంతే నాణ్యతగా ఎలా వాడుకోవాలో దానికి రక్షణ కల్పించే సదుపాయాలను కూడా జతగా v furnituremall అందచేస్తుంది. ఆర్థిక స్తోమతను బట్టీ, అనారోగ్య సమస్యలను బట్టీ, వారి వయసును బట్టీ స్థలాన్ని బట్టీ, అంగుళాలను బట్టీ ఎటువంటి పరుపులు ఎంచుకోవాలో సవివరంగా v furnituremall యాప్ లో తెలుసుకోవచ్చు. వినియోగదారులే వారికి కావలసిన పరుపుల్ని వారే స్వయంగా తయారు చేసుకోవచ్చు.
V furnituremall వారు అందించే యాక్సెసరీస్ వల్ల పరుపు జీవితకాలం మొత్తం పాడవని, మరకలు పడని, చెడువాసన రాని విధంగా అనుభూతి చెందొచ్చు. అంతేకాదు ఇలా తయారు చేసుకున్న పరుపుల్ని వయసును బట్టీ అవసరాలను బట్టీ, అనారోగ్య సమస్యలను బట్టి మార్పులు చేసుకోవచ్చు. కంపెనీ పరుపులకు ఇలాంటి అవకాశం ఉండదు. కంపెనీల మాయాజాలంలో పడకుండా మంచి పరుపుల్ని ఎంచుకోవడం తెలివైన పని. అందుకు సరైన చిరునామా v furnituremall తెనాలి. మరిన్ని వివరాల కోసం వీ ఫర్నిచర్ మాల్ యాప్ ను Download చేసుకోవచ్చు. Varamlatex.in websites ను చూడవచ్చు.