పెద్ద పెద్ద బ్రాండెడ్ పరుపులు.. వాటి తయారీ వెనుక ఇంత మోసం జరుగుతుందా..?| Mattress | Branded Mattress Quality Check
మనం రెగ్యులర్ గా వాడుకునే పరుపులు ఎంత బ్రాండెడ్ అయినా ఒక్కోసారి వాటిలో ఏమేమి పెడతారు? నిజంగా ప్రకటనలలో చూపించినట్లే అన్నీ ఐటమ్స్ కరెక్ట్ గా ఉంటాయా లేదా? అని సందేహాలు వస్తుంటాయి. ఇప్పుడీ ఆర్టికల్ చదివితే మీకు బ్రాండెడ్ పరుపులు ఎలా తయారవుతాయో.. అందులో ఏమేమి ఉంటాయో క్లియర్ గా అర్ధమవుతుంది. ఒక్కోసారి మనం తయారు చేసుకునే పరుపులు కంపెనీ పరుపుల కన్నా ఎక్కువ రేట్ అనిపించవచ్చు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకు జీడిపప్పు పలావ్ ఉంది.. అది బయట కొనుక్కున్నా, ఇంట్లో తయారు చేసుకున్నా పలావ్ ఒకటే. అందులో ఉండే జీడిపప్పు వల్ల ఖర్చులో తేడా కనిపిస్తుంది.
అదే విధంగా ఇప్పుడు మీరు బ్రాండెడ్ బెడ్స్ ని గమనించినట్లయితే.. నాలుగు అంగుళాల మందం కలిగిన క్వీన్ సైజ్ బ్రాండెడ్ పరుపు ధర రూ. 9500. అయితే.. ఈ నాలుగు ఇంచులలో మూడున్నర ఇంచులు ఈపి(EP) షీట్స్ ని పెట్టేసి.. అర ఇంచు పి.యూ. ఫామ్ తో సేల్ చేస్తున్నారు. ఇదే బెడ్ ని మనం తయారు చేసుకుంటే.. రూ. 2500 – 3000 లలో అయిపోతుంది అంటే నమ్ముతారా! కానీ.. నమ్మి తీరాలి. ఎలాగంటే.. సింపుల్ గా ఆరు వందలలో ఈపి షీట్ కొనుక్కొని, దానిపై ఓ టాపర్, బెడ్ షీట్ వేశారంటే సరిపోతుంది. వీటిలో టాపర్, బెడ్ షీట్ కే రేట్ ఎక్కువ. అలా మూడు వేలలో సింపుల్ గా ఈ బెడ్ తయారు చేసుకోవచ్చు.
ఇదే బెడ్ మార్కెట్ లో రూ. 9500 లకు సేల్ చేస్తున్నారు. అలాగే మీరు ఇండియాలో నెంబర్ వన్ కంపెనీస్ కి చెందిన పరుపును కూడా లోపల ఏముందో చూస్తే.. పేరుకు 4 ఇంచుల రీబాండెడ్ క్వీన్ సైజ్ పరుపు. కానీ.. దాని లోపల గమనిస్తే.. మూడున్నర ఇంచులు ఈపి షీట్, అర ఇంచ్ రీబాండెడ్ సెట్ చేశారు. దాని ధర పదివేలు. ఇదే పరుపు మనం తయారు చేసుకుంటే మూడు వేలలో అయిపోతుంది. ఇలాంటివి మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎన్నాళ్ళైనా ఉంటాయి. కానీ.. వీటి వల్ల నడుము నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. ఓసారి మీరు వి ఫర్నిచర్ మాల్(V Furniture Mall) లో చూస్తే లాటెక్స్ రీబాండెడ్ బెడ్.. టాపర్, బెడ్ షీట్, ట్రాన్స్ పోర్ట్ తో కలిపి రూ. పదివేలకు అందిస్తోంది. పూర్తి వివరాల కోసం vfurnituremall.in వెబ్ సైట్ ని, V Furniture Mall యూట్యూబ్ ఛానల్ ని సంప్రదించవచ్చు.