ప్రస్తుతం చదువుకునే పిల్లలు ఇళ్లలో కన్నా హాస్టల్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. సాధారణంగా పిల్లలు హాస్టళ్లకు తీసుకెళ్లే పరుపులు మీద తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ పెట్టట్లేదు. రోడ్డు పక్కన తక్కువ ధరలకు తీసేసుకుని పంపించేస్తున్నారు. అలాంటి పరుపుల వాడటం వల్ల వారికి కూడా తెలియకుండానే ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. చదువుల నిమిత్తం నాలుగైదు సంవత్సరాలు తక్కువ కాకుండా హాస్టల్లో గడపాల్సి ఉంటుంది.
కాబట్టి పిల్లలు వాడుకునే హాస్టల్ బెడ్ ను కొంచెం శ్రద్ధ తీసుకొని మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అప్పుడు పరుపులు మంచి నాణ్యతలో మంచి ప్రామాణికతతో ఎక్కువ కాలం వాడుకునేందుకు వీలుగా ఉంటాయి. హాస్టల్ బెడ్ అనగానే మూడు ఆరు సైజులో కానీ దివాన్ సైజులో కానీ అంటే 6, 2 1/2 కొలతలతో తయారు చేసుకున్న పరుపులు పిల్లలు చదువులు అవసరాలు తీరిపోయాక వృధాగా తీసేయక్కర్లేదు.
మనం ఇంట్లో వాడుకునే దివాన్ మంచం మీద కూడా పరుపులా వాడుకోవచ్చు. జిప్ కవర్ కొనుక్కొని సూపర్ సాఫ్ట్ కానీ, గ్రిడ్ టెక్నాలజీ కానీ, మెమరీ ఫోమ్ కానీ, ఖర్చు భరించగలిగితే లాటెక్స్ అయినా వాడుకోవచ్చు. రెండు అంగుళాల లాటెక్స్ వాడటం వల్ల పిల్లలకి హాయిగా నిద్ర పడుతుంది. మంచి నిద్ర వల్ల ఆరోగ్యం సమకూరడమే కాకుండా చక్కగా చదువుకోవచ్చు.
బయట బజార్లో కొనుగోలు చేసే వాటిలో Ep షీట్లే ఎక్కువగా వాడుతున్నారు. 90% Ep షీట్లను హాస్టల్ బెడ్ కోసం వాడుతున్నారు. వీటి వాడటం వల్ల పిల్లలకు సమస్యలు వస్తాయి. మరీ మెత్తటి పరుపులు కూడా మంచివి కావు. సూపర్ సాఫ్ట్ కానీ (32 డెన్సిటీలో) వాడుకోవచ్చు. ఖర్చుపరంగా భరించగలిగే వారికి మొదటి ప్రాముఖ్యత లాటెక్స్ కి ఇవ్వడం మేలైన పని. లేకపోతే మెమోరీకి ప్రాధాన్యత ఇవ్వచ్చు.
లాటెక్స్ నాలుగు కానీ ఆరు అంగుళాలు కానీ వాడుకోవచ్చు. లేదా నాలుగు అంగుళాల్లో హెచ్ఆర్ ఫోమ్ కానీ, JJ ఫోమ్ కానీ వాడుకోవచ్చు.
ఏమైనా సరే నాణ్యత గల వాటిని ఎంపిక చేసుకోవాలి. రెండు అంగుళాల్లో తీసుకోవడం వల్ల పరుపులు అనువుగా మడి చేసుకోవచ్చు. హాస్టల్స్ కే కాదు ఇలా పరుపును గుండ్రంగా మడుచుకోవడం వల్ల ట్రావెల్ బెడ్ గా కూడా వాడుకోవచ్చు.
కారులో కూడా వాడుకోవచ్చు. లేదా ఇంట్లో వాడుకునే దివాన్ కాట్ మీద కూడా ఉపయోగించుకోవచ్చు. దాని మీద ఉండే ఎలాస్టిక్ పరుపుల్ని తీసుకోవడం వలన వృధా ఏమీ ఉండదు. ఒక్కసారి పెట్టే ఖర్చు వల్ల పరుపు జీవితకాలం మొత్తం ఉపయోగించుకోవచ్చు. దానిపై వేసే జిప్పు కవర్ ను కూడా ఉతుక్కునే సదుపాయం కూడా ఉంటుంది.
మరిన్ని వివరాలకు v furnituremall యాప్ ను download చేసుకోవచ్చు. వినియోగదారులకు వచ్చే ఇతర సందేహాలకు వీ ఫర్నిచర్ మాల్ యాజమాన్యం వారు నిర్వహించే ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రతి ఆదివారంసాయంత్రం 5 నుండీ 6 గంటల వరకూ v furniture mall యాజమాన్యం వారు ప్రత్యక్షంగా వినియోగదారులతో సంభాషిస్తారు.మరింత సమాచారం కొరకు Varmlatex.in website ను సందర్శింవచ్చు.